Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తను విజయవాడకు చెందిన ఓ వ్యాపారవేత్త: తన ప్రేయసి గురించి క్లూ ఇచ్చిన రాజ్ తరుణ్

  • నా పుట్టినరోజు నాడు ఆమెను చూశా
  • ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం
  • అందరి దృష్టిలో పడటం తనకు ఇష్టం లేదు
  • నేను ఎప్పటి నుంచో పెళ్లికి సిద్ధం
ఇటీవల ఓ సందర్భంలో తాను ఓ అమ్మాయిని ప్రేమించానని, తనతో పెళ్లికి రెడీ అవుతున్నానని సినీ కథానాయకుడు రాజ్‌తరుణ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు తన ప్రియురాలికి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచాడు. తాజాగా రాజ్ తరుణ్ ఓ ఆంగ్ల పత్రికతో, తన ప్రియురాలు ఏ నగరానికి చెందిన అమ్మాయి? ఆమెతో పరిచయం ఎలా ఏర్పడింది? తదితర విషయాలను పంచుకున్నాడు. తాము గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, అయితే తన ప్రియురాలికి చిత్ర పరిశ్రమతో ఎలాంటి సంబంధమూ లేదని రాజ్ తరుణ్ వెల్లడించాడు.

ఆమె విజయవాడకు చెందిన యువతి అని, తనో వ్యాపారవేత్త అని, సింపుల్‌గా ఉండే తెలుగింటి అమ్మాయని తెలిపాడు. అందరి దృష్టిలో పడటం తనకు ఇష్టం లేదని, అందుకే తన పేరును వెల్లడించడం లేదన్నాడు. ఆరేళ్ల క్రితం వైజాగ్‌లో తన పుట్టినరోజును జరుపుకున్న సందర్భంగా తొలిసారిగా ఆమెను చూశానని, తమ అభిరుచులు కలవడంతో తామిద్దరి మధ్య ప్రేమ మొదలైందని తెలిపాడు. తామిద్దరం తరచూ కలుస్తుంటామని ప్రస్తుతం జీవితాంతం ఒకరికొకరం అనే ఫీలింగ్‌లో ఉన్నామని తెలిపాడు. తమ తల్లిదండ్రులు కూడా పెళ్లికి అంగీకరించారని, తాను ఎప్పటి నుంచో పెళ్లికి సిద్ధమని తనే ఆలస్యం చేస్తోందని రాజ్ తరుణ్ అన్నాడు. వచ్చే ఏడాది తామిద్దరం పెళ్లి పీటలెక్కాలనుకుంటున్నట్టు తెలిపాడు.
Raj Tharun
Vizag
Birthday
Vijayawada
Cine Industry

More Telugu News